పెద్దేముల్, అక్టోబర్ 18 : ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో పురుగులు వస్తున్నాయని.. ఆ రైస్‌ను ఎలా తినాలని గాజీపూర్ గ్రామస్తులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం ఆ గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు వీరప్ప గ్రామస్తులతో కలిసి రేషన్ షాపులో పంపిణీ చేస్తున్న బియ్యాన్ని పరిశీలించి అవాక్కయ్యారు.
అధికారులు స్పందించి వెంటనే నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని లేకుంటే అందరం కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముస్తాఫా, లాలు, అంజి, వెంకట్, శ్రీను, ఖయీం, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.