Woman Murder | మేడ్చల్, మే 16 : మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి స్థానికులు షాక్ అయ్యారు.
వికారాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మి (50) అత్వెల్లిలో రేకుల రూమ్లో నివాసం ఉంటుంది. స్థానికంగా రోజు వారి కూలీగా ఓ వైన్స్లో పని చేస్తుంది. శుక్రవారం తెల్ల వారుజామున రేకుల రూమ్లో నుంచి పొగలు రావడంతో, అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ హుటాహుటినా చేరుకుని పరిశీలించారు. సగం కాలిన స్థితిలో మృతదేహం లభించింది. గొంతు, చెవులు, ముక్కు కోసి చంపి, ఆ తర్వాత కాల్చివేసినట్టు తెలుస్తోంది. క్లూస్ టీం సహాయంతో పోలీసులు ఆధారాలను సేకరించారు.