Missing | చేవెళ్ల టౌన్, ఫిబ్రవరి 13: ఇంటినుండి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చేవెళ్ల ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్ గ్రామ వాసి కృష్ణ ప్రైవేట్ జాబ్ చేస్తూ భార్య పల్లవి (21)తో జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే 12న మాదిరే కృష్ణ పనికి వెళ్లి సాయంత్రం ఐదుగంటలకు తన సొంత గ్రామమైన మల్కాపూర్‌లోని తన ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి అందరూ కలిసి బోజనం చేసి పడుకున్నారు. అదే రోజు తెల్లవారుజామున మూడు గంటలకు కృష్ణ నిద్రలేచి పక్కన చూడగా అతడి భార్య పల్లవి కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వెతకడంతో పాటు బంధువుల ఇండ్ల వద్ద వెతికనా భార్య ఆచూకి అభించలేదు. భార్య ఆచూకీ లభించకపోవడంతో భర్త చేవెళ్ల పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.