ఆమనగల్లు, ఫిబ్రవరి 26 : బంధువు అంత్యక్రియలకు వెళ్లిన మహిళ తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి (Road accident)గురై అనంతలోకాలకు వెళ్లింది. ఈ ఘటన ఆమనగల్లులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ చెందిన పద్మ కుటుంబ సభ్యులతో కలిసి కారులో అచ్చంపేటకు బంధువు అంత్యక్రియలకు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో కారు అమనగల్లులోని కాటన్ మిల్లు సమీపంలో కార్ ఛార్జింగ్ పాయింట్ వద్ద ఛార్జింగ్ పెట్టారు. జగదీశ్వర్ భార్య జయమ్మ (60) వాష్ రూమ్ వెళ్ల డానికి రహదారి దాటుతుండగా.. ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జయమ్మ మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.