నాలుగు నియోజకవర్గాల్లోనూ..
జిల్లాలోని నాలు గు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కొడంగల్, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎనుముల రేవంత్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి, బుయ్యని మనోహర్‌రెడ్డి విజ యం సాధించారు.
- కొడంగల్, వికారాబాద్, పరిగి, తాండూరు సెగ్మెంట్లలో హస్తం పార్టీ అభ్యర్థుల ఘన విజయం
- కొడంగల్‌లో భారీ మెజార్టీతో గెలిచిన రేవంత్ రెడ్డి
- నోటాకు 5101 ఓట్లు
వికారాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని నాలు గు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కొడంగల్, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎనుముల రేవంత్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి, బుయ్యని మనోహర్‌రెడ్డి విజ యం సాధించారు. కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్‌కుమార్ రికార్డు సృష్టించారు.
వికారాబాద్ నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఓడిపోయిన వ్యక్తులు గెలిచిన సందర్భంలేదు, అయితే గత రెండు పర్యాయాలు ఓడిపోయిన ప్రసాద్‌కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్రను తిరగరాశారు. అదేవిధంగా తాండూరు నుంచి గెలిచిన మనోహర్‌రెడ్డి పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలుపొందడం గమనార్హం. గతంలో జడ్పీటీసీగా, డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసిన పరిగి నియోజకవర్గానికి చెందిన మనోహర్‌రెడ్డి తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలువడం విశేషం.
బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డిపై 32,532 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్‌రెడ్డికి 1,07,429 ఓట్లురాగా, నరేందర్‌రెడ్డికి 74,897 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా వికారాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసాద్‌కుమార్ 12, 671 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రసాద్‌కుమార్‌కు 86,477 ఓట్లురాగా, ఆనంద్‌కు 73,806 ఓట్లు వచ్చాయి. పరిగి ఎమ్మెల్యే గా రామ్మోహన్‌రెడ్డి 22,481 ఓట్లతో గెలుపొందారు, రామ్మోహన్‌రెడ్డికి 96,284 ఓట్లురాగా, మహేశ్‌రెడ్డికి 73,803 ఓట్లు వచ్చాయి. తాండూరు ఎమ్మెల్యేగా 6,583 ఓట్ల మెజార్టీతో మనోహర్‌రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్‌రెడ్డికి 84,662 ఓ ట్లురాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్‌రెడ్డికి 78,079 ఓట్లు వచ్చాయి.
నోటాకు 5102 ఓట్లు..
జిల్లాలో చాలామంది ఓటర్లు నోటాకు ఓటేశారు. అయితే ఏదేని నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటాకు ఓటేసే అవకాశాన్ని ఓటర్లకు ఎన్నికల సంఘం కల్పించింది. అయితే జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలోనే అధిక మంది ఓటర్లు నోటాకు ఓటేశారు. జిల్లావ్యాప్తంగా 5102 మంది ఓటర్లు నోటాకు ఓటేయగా,…వికారాబాద్ నియోజకవర్గంలో 1398 మంది, తాండూరు నుంచి 592 మంది, కొడంగల్ నుంచి 2002 మంది, పరిగి నియోజకవర్గంలో 1110 మంది ఓటర్లు నోటాకు ఓటేయడం గమనార్హం.
తాండూరు ప్రజలకు ధన్యవాదాలు
తాండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. విద్య, వైద్యం, రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యనిచ్చి నియోజకవర్గాన్ని ఓ మాడల్‌గా అభివృద్ధి చేస్తా. తాండూరులో కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు తగు చర్యలు తీసుకుంటా. జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎం కాబోతున్న దృష్ట్యా ఆయన సహకారంతో నియోజకవర్గాభివృద్ధికి భారీగా నిధులు తీసుకొస్తా.
– బుయ్యని మనోహర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

