తాండూరు, మార్చి 10 : వానకాలం గడిచిపోయింది. యాసంగి ప్రారంభమై మూడు నెలలు దాటిపోతున్నా రైతులకు ఇంకా రైతుభరోసా పెట్టుబడి సాయమే అందలేదు. రాష్ట్రంలో రైతుల బాధలు తీరాలంటే ఒక్క కేసీఆర్తో సా ధ్యం. రైతుల బాధలు తెలిసిన ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్రెడ్డి నెరవేరని హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తు న్నాడు.
పంటల సాగు కోసం గతంలో కేసీఆర్ రైతుబంధు ఇచ్చిన విధంగా ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా పేరుతో ఎకరానికి రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రూ.12 వేలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 15 నెలలు దాటినా ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధుతో వ్యవసాయం పండుగల చేసుకున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక చాలా ఇబ్బందిగా మారింది.
ఎరువుల ధరలు పెరుగడంతోపాటు సమయానికి దొరకడం లేదు. కరెంటు కూడా సక్రమంగా ఉండకపోవ డంతో నీళ్ల పంటలు వేయాలంటే భయంగా ఉన్నది. దేవుళ్లపై ఒట్టేసిన రేవంత్రెడ్డి ఝాటా మాటలతో రాష్ట్రం కరువుగా మారుతున్నది. రైతుల పంట రుణాలను కూడా సక్రమంగా పూర్తి చేయలేదు. 35 శాతం కూడా మాఫీ కాలేదు. రైతులకు కాంగ్రెస్ పాలన శాపంగా మారింది. ఈ పాలనలో తీవ్రమైన కష్టాలను చూస్తున్నాం. మళ్లీ కేసీఆర్ పాలన వస్తేనే రైతుల కుటుంబాల్లో వెలుగులు వస్తాయి.
-రాంపూర్ రాములు, రైతు, జుంటుపల్లి గ్రామం, యాలాల మండలం