Kondapur | భార్య, కొడుకు ఉండగా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న భర్త ..నిరనసన చేపట్టిన మొదటి భార్య : వీడియో
Kondapur | కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కాదని రహస్యంగా రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. నిలదీసిన మొదటి భార్యపై దాడికి పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కొండాపూర్, మే 17 : కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కాదని రహస్యంగా రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. నిలదీసిన మొదటి భార్యపై దాడికి పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బాధితురాలు భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… లింగంపల్లి రైల్ విహార్ కాలనీలో నివాసం ఉండే బండా రోహిత్ యాదవ్ తో మహాలక్ష్మికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అయితే, కొంత కాలంగా భార్య, కొడుకుని సరిగ్గా పట్టించుకోకోపోవడమే కాకుండా వేధింపులకు గురి చేస్తుండడంతో అల్వాల్ బొల్లారంలోని తన పుట్టింట్లో ఉంటుంది. ఇటీవల తనకు తెలియకుండా రోహిత్ యాదవ్ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు.
విషయం తెలిసి మహాలక్ష్మి భర్తను నిలదీసేందుకు ఇంటికి వెళ్లగా రోహిత్ యాదవ్ దాడికి పాల్పడ్డాడు.
తనను, తన కొడుకును వద్దంటూ వేధిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహాలక్ష్మి, తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ముందే న్యాయం చేయాలంటూ నిరసనకు దిగింది. తమకు జరిగిన అన్యాయంపై బాధితురాలు మహాలక్ష్మి చందానగర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

