యాచారం, ఏప్రిల్ 5 : ఫార్మా ప్లాట్ల డాక్యుమెంట్లు ఎప్పుడు వస్తాయోనని భూములిచ్చిన బాధిత రైతులు ఎదురు చూస్తున్నారు. తొమ్మిది నెలలు దాటినా రాకపోవడంతో ఇకా.. వస్తాయా..? అని ఆందోళన చెందుతున్నారు. మార్చి 7న 800 మంది రైతులకు డాక్యుమెంట్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా.. ఎమ్మెల్యే అందుబాటు లో లేకపోవడంతో రిజిస్ట్రేషన్ పత్రాల పం పిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతుల కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 121 గజాల స్థలాన్ని కేటాయించగా.. మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మి ద్ద గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పట్టా సర్టిఫికెట్లనూ అందించారు.
కందుకూరు మండలం లోని మీర్ఖాన్పేట సమీపంలోని బేగరికంచె (బల్జగూడ)లో 622 ఎకరాల్లో హెచ్ఎండీఏ వెంచర్‌ను ఏర్పాటు చేసి బ్లాకుల వారీగా ప్లా ట్లను రెడీ చేశారు. దానినే ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీగా పేరు మార్చింది. 2025 జూ లైలో రెవెన్యూ, టీజీఐఐసీ శాఖల అధికారు లు ఫార్మా ప్లాట్లు కేటాయించిన స్థలంలోనే లాటరీ ద్వారా రైతులకు ప్లాట్ నంబర్లను కేటాయించి.. మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రైతుల పేరున రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లనూ తయారు చేశారు. అయితే లాటరీ తీసి తొమ్మిది నెలలు కావొస్తున్నా నేటికీ రైతులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందకపోవడంతో అయోమయానికి గురవుతున్నా రు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే కార్యక్రమంలోనే డాక్యుమెంట్లు అందజేస్తామని చెప్పిన అధికారులు ప్యూచర్‌సిటీ ప్రారంభోత్సవం పూర్తైనా ఇప్పటికీ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అసలు రైతులకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తారా లేదా అని ప్రశ్నిస్తున్నారు.
600 గజాల ప్లాట్లకు స్థలం కరువు
ఫార్మాసిటీ కోసం 6 ఎకరాలకు పైగా భూములిచ్చిన రైతులు నేటికీ ఫార్మా ప్లాట్లకు నోచుకోలేదు. గతంలో సేకరించిన వెంచర్లో ఇప్పటికే ప్లాట్లను రెడీ చేశారు. కాంగ్రెస్ సర్కారు ప్లాట్లు తయారు చేసిన వెంచర్ స్థలం నుంచే 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును నిర్మించనునండటంతో 600 గజాల ప్లాట్ల ఏర్పాటుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో 5 ఎకరాల్లోపు వరకు భూములిచ్చిన రైతులకు మాత్రమే 60, 121, 242, 181, 309, 484 ప్లాట్లను అందజేశారు. స్థలం లేకపోవడంతో 6 ఎకరాలకు పైగా భూములు కోల్పోయిన రైతులకు నేటికీ ప్లాట్లను కేటాయించపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
త్వరలో అందజేస్తాం
భూనిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను త్వరలోనే అందజేస్తాం. లబ్ధిదారులకు ఎకరాకు 121 గజాల చొప్పున ప్రభుత్వమే రైతుల పేరున మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ఇప్పటివరకు పూర్తైనా రిజిస్ట్రేషన్ పత్రాలను రైతులకు త్వరలోనే అందజేస్తాం. గత నెలలో యాచారంలో పంపిణీ చేయాలనుకున్నాం కానీ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. ఎమ్మెల్యే ఎప్పుడు సమయమిస్తే అప్పుడు పంపిణీ చేస్తాం.
-అనంతరెడ్డి ఆర్డీవో, ఇబ్రహీంపట్నం
మార్చి 7న ముహూర్తం.. ఎమ్మెల్యే రాడని రద్దు
ఫార్మా పాట్ల లబ్ధిదారుల గత తొమ్మిది నెలల ఎదురు చూపులకు తెరదించుతూ మార్చి 7న 800 మంది రైతులకు డాక్యుమెంట్లు ఇచ్చేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. మార్చి 6న 400 మంది లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు ఫోన్ చేసి రేపు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుపోవాలని చెప్పడంతో వారు ఎంతో సంతోషించారు. అయితే కొన్ని గంటలకే ఎమ్మెల్యే రావడంలేదని తెలుసుకున్న అధికారులు రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీని వాయిదా వేశారు. మళ్లీ వెంటనే లబ్ధిదారులకు ఫోన్ చేసి రేపటి కార్యక్రమం రద్దు అయిదని.. మళ్లీ ఎప్పడనేది ఫోన్ చేసి చెబుతామని అధికారులు తెలపడంతో రైతులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
భయాందోళనలో ప్లాట్లు కొన్న వారు
ప్రభుత్వం ప్లాట్లకు నంబర్లు కేటాయించక ముందు ఎంతోమంది రైతులు తమ ప్లాట్లను అవసరాల కోసం నోటరీల ద్వారా అమ్ముకున్నారు. ఆ ప్లాట్లకు భవిష్యత్తు ఉంటుందని గ్రహించిన రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, వందల సంఖ్యలో ప్లాట్లను కొన్నారు. మొదట్లో 121 గజాల ప్లాటు రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అమ్మగా.. ప్లాట్లు లాటరీ తీసే ముందు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు.. లాటరీ తీసిన తర్వాత రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ విక్రయించారు. కానీ ప్లాట్ల లాటరీ తీసి నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ పత్రాలు రాకపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు పత్రాలు వచ్చేదెప్పుడు.. వారు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసేదెప్పుడని దిగులు చెందుతున్నారు. ఇదిలా ఉంటే ధరలు అమాంతం పెరగడంతో కొందరు అసలు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తారా లేదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
నిర్వాసితులకు ఎకరానికి 121 గజాల ప్లాటు
ఫార్మా భూనిర్వాసితులకు పరిహారంతోపాటు కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట సమీపంలోని బేగరికంచె వద్ద సర్వేనంబర్ 90, 91లో ఎకరాకు 121 గజాల చొప్పున పాట్లను ఇచ్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం హెచ్ఎండీఏ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లను మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అందజేశారు. రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించే సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. కొంతమంది బాధిత రైతులకు ఇండ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను అందజేశారు. అక్కడ రోడ్ల నిర్మాణంతోపాటు విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేశారు.
మండలంలో 3,745 ప్లాట్లు..
యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలకు చెందిన 5,720 మంది రైతులకు ప్లాట్లు పంపిణీ చేయనున్నారు. యాచారం మండలంలోని నాలుగు గ్రామాలకు కలిపి ఎకరాకు 121 గజాల చొప్పున 3,745 ప్లాట్లు, కుర్మిద్దలో 1,240, నానక్‌నగర్‌లో 359, మేడిపల్లిలో 1,601, తాటిపర్తిలో 545 పాట్లు మంజూరు చేశారు. ఫార్మా పాట్ల లబ్ధిదారులు మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట, బేగరికంచె, పంజాగూడ, సాయిరెడ్డిగూడ, అన్నోజీగూడ, ముచ్చర్ల, సార్లరావులపల్లి, కడ్తాల్ మండలంలోని పల్లెచెల్కతండా గ్రామాల్లోనూ ఉన్నారు.
ప్రభుత్వం వద్దే 2,200 ఎకరాల ప్లాట్లు
ఫార్మాకు భూములివ్వని రైతులకు సంబంధించిన ప్లాట్లు ప్రభుత్వం వద్దే ఉన్నాయి. ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల కోసం రైతులు తమ వివరాలను అధికారులకు ఇవ్వలేదు. దీంతో సుమారు 800 మంది రైతులకు చెందిన 2200 ఎకరాలకు సంబంధించిన ప్లాట్లకు లాటరీ తీసి ప్లాట్ నంబర్ అలర్ట్ చేసినా రైతులు వాటిని తీసుకునేందుకు సుముఖత చూపలేదు. అంతేకాకుండా తమకు భూములే కావాలని ప్లాట్లు వద్దని ఆర్డీవో అనంతరెడ్డికి వినతిపత్రాన్ని కూడా అందజేశారు.
తొమ్మిది నెలలు దాటినా డాక్యుమెంట్లు ఇవ్వరా?
ఫార్మా భూనిర్వాసితులకు కేటాయించిన ఇంటి స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను వెంటనే అందజేయాలి. లాటరీ తీసి 9 నెలలు దాటినా ప్లాట్లకు చెందిన పత్రాలు ఇవ్వకపోవడం సమంజసం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం హెచ్ఎండీఏ వెంచర్లో వాటర్ ట్యాంకులు, బడి, పార్కులు, విద్యుత్తు, భూగర్భ డ్రైనేజీ, రోడ్లను ఏర్పాటు చేయాలి. అలాగే 600 గజాలకు సంబంధించిన ప్లాట్ల లబ్ధిదారులకు స్థలాన్ని కేటాయించి.. ప్లాట్లను రెడీ చేసి లాటరీ ద్వారా ప్లాట్ల నంబర్లు కేటాయించడంతోపాటు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు