Cyber Fraud | చేవెళ్ల టౌన్, ఫిబ్రవరి 13: వాట్పప్కు వచ్చిన మెసేజ్‌పై స్పందించిన ఓ వ్యక్తి రూ.80 వేలు పొగొట్టుకున్న సంఘటన చేవెళ్ల పోటీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చేవెళ్ల ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి దవాఖానలో డాక్టర్‌గా పని చేస్తున్న పవర్ ఆదిత్య అప్పారావుకు ఈ నెల 10 మధ్యాహ్నం ఒంటి గంట నుండి ఏడు గంటల మధ్య వాట్పప్‌లో గుర్తు తెలియని (8266075602) నంబర్ నుండి మీరు ఈ టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వాలి అని మెసేజ్ వచ్చింది.
దీంతో భాదితుడు మెసేజ్‌కు స్పందించాడు. మరలా అదే నంబర్ నుండి మరో సారి మీరు తదుపరి సమాచారం కోసం మా ఛానెల్లో జాయిన్ అవ్వాలని మెసేజ్ రావడంతో భాదితుడు తెలవ కుండానే ఆ మెసేజ్ పాలో అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే అతడి అకౌంట్ నుండి రూ.80 వేలు డెబిట్ అయ్యాయని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చేసుకున్న బాధితుడు వెంటనే చేవెళ్ల పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశాడు. చేవెళ్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.