హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలన ( Congress government ) లో ప్రజలకు , సమాజంలో నాలుగవ స్తంభమైన జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ నాయకుడు పట్లోల్ల కార్తిక్ రెడ్డి ( Patlolla Karthik Reddy ) ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం జర్నలిస్ట్ కేవీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్ర పోలీసులు తెలంగాణకు వచ్చి ఇక్కడి జర్నలిస్టులను లాక్కునిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని, వెంకట్రామిరెడ్డిని చిత్రహింసలకు గురిచేస్తే, ఎన్ కౌంటర్ చేస్తే దిక్కెవరని ప్రశ్నించారు. కేవీరెడ్డి సతీమణి విజయలక్ష్మీపై దాడి చేసిన ఆంధ్ర పోలీసులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో తెలంగాణ ప్రజలు నిర్భయంగా ఉండేవారని, ఇవాళ కాంగ్రెస్ ఏలుబడిలో ఆందోళన నెలకొందని అన్నారు. ఆడబిడ్డ విజయలక్ష్మీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.