ఇబ్రహీంపట్నం, ఆగస్టు 21 : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలే మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మాల్, నల్లవెల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి సుమారు వందమంది సోమవారం ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందని, సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికీ చేరుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. నల్లవెల్లి గ్రామ కబ్రస్తాన్ ప్రహరీ కోసం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రూ.10లక్షల ప్రొసీడింగ్‌ను అందజేశారు.
పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు..
బీజేపీ యాచారం మండలం ఉపాధ్యక్షుడు మందడి ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ బూత్ అధ్యక్షుడు గెనమోని రమేశ్, నల్లవెల్లి గ్రామానికి చెందిన మహేశ్, బ్రహ్మచారి, మైనార్టీ నాయకులు ఎండీ మోహిన్, ఎండీ దస్తగిరి, ఎండీ జావిద్తో పాటు మాల్ గ్రామానికి చెందిన అనేకమంది బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశ్ పాల్గొన్నారు.
టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి
చేవెళ్లటౌన్ : నాన్ చేరు గ్రామ అనుబంధ గ్రామం కిష్టాపూర్ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అంజయ్య, రాములు, మల్లేశ్, కిష్టయ్య, రవి, శంకర్ బీఆర్ఎస్లో చేరారు. వారికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గులాబీ కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో దేవుని ఎర్రవల్లి సర్పంచ్ మాణిక్య రెడ్డి, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింహులు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రాములు పాల్గొన్నారు.