మహేశ్వరం, జూన్ 26: బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఆమె సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సుపరిపాలనను సాగిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. వివిధ పార్టీల నాయకులతో చేరికతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరిస్తున్నదన్నారు.