చర్లపల్లి : చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సమగ్రాభివృద్ధికి కుషాయిగూడ ( Kushaiguda) సంక్షేమ సంఘం కృషి చేస్తుందని సంఘం అధ్యక్షుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి (Singireddy Somasekhar Reddy) పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని కుషాయిగూడలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చక్రపాణిగౌడ్, కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుషాయిగూడను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసోసియెషన్ ప్రతినిధులు చల్లా వీరేశం, చిత్తుల కిషోర్‌గౌడ్, కొడకండ్ల యాదయ్య, వాసుదేవ్ ముదిరాజ్, చల్లా ప్రభాకర్, చల్లా వెంకటేశ్, అనిల్‌బాబు, యవపురం రవి, లక్ష్మణ్‌గౌడ్, బాల్‌నర్సింహ్మ, బ్రహ్మాచారి, గోపాల్, చంద్రశేఖర్, శ్రీధర్, వెంకటేశ్‌గౌడ్, దినేష్, క్రాంతి, శంకర్‌గౌడ్, లావణం శ్రీనివాస్, శ్రీకాంత్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్, సుదర్శన్, బాలకృష్ణ, సాకేత్గౌడ్, రమేశ్ చౌదరి, లక్ష్మణ్, రాజేశ్, బాలరాం చౌదరి, సోనుచౌదరి, రాజుశర్మ, నర్సింహ్మ, శ్రీను, సత్యనారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.