సిటీబ్యూరో, మే 16, (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో 201 కేసులలో రూ.50 వేలకు మించి ఆధారాలు లేని రూ.8,48,65,710 నగదుకు సంబంధించి జిల్లా గ్రీవెన్స కమిటీకి సిఫారసు చేయగా, 192 కేసులకు చెందిన రూ.5.93కోట్లను డీజీసీ ద్వారా విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. సీజ్ చేసిన నగదులో రూ.10 లక్షలకు మించి పట్టుబడిన ఆరు కేసులకు సంబంధించి రూ.1,88,86,938 ఆదాయ పన్ను, కమర్షియల్ ట్యాక్స్ శాఖలకు రిఫర్ చేసినట్లు తెలిపారు. ఆదే విధంగా మూడు కేసులలో రూ. 66, 49,000 ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.