చేవెళ్ల రూరల్, జనవరి 6: అధునాతన హంగులతో చేవెళ్ల బస్టాండ్‌ను నిర్మిస్తామని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం హెచ్ఎండీఏ నిధులు రూ.3కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఆర్కిటెక్ట్ అధికారుల తో సమీక్ష నిర్వహించారు. మోడ్రన్ చేవెళ్ల బస్టాండ్ ఎలా ఉం టే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉం టుందనే అంశాలపై ఆర్కిటెక్ట్ అధికారుల తో చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చేవెళ్ల బస్టాండ్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో 2.5 ఎకరాల్లో అధు నాతనంగా నిర్మాణం చేపట్టి తెలంగాణలో గ్రీన్ బస్టాండ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. చేవెళ్ల బస్టాండ్ నిర్మాణానికి నిధులు మం జూరు చేసిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి చేవెళ్ల ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.