నందిగామ, జూన్13: ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. షాద్‌నగర్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కర్యాలయంలో నందిగామ, కొత్తూరు, కొందుర్గ్, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్ మండలాలకు చెందిన పలువురికి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆపదలో ఉన్న వాళ్లు సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించేందుకు కృషి చేయాలని, ఎమ్మెల్సీ కార్యాలయంలో సంప్రదించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సూచించారు.