కందుకూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో ( Elections ) సత్తా చాటాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ (BRS) మండల నాయకులు శనివారం క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు.
ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రభుత్వ మోసాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని కోరారు. గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కోరారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లలో మెజార్టీ స్థానాలను కేవసం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురుసాని రాజశేఖర్‌రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి,దేవరశెట్టి చంద్రశేఖర్,ఆనేగౌని అంజయ్యగౌడ్, లచ్చా నాయక్, ఎలుక మేఘనాధ్రెడ్డి, డైరెక్టరు పొట్టి ఆనంద్,మాజీ సర్పంచ్‌లు పరంజోతి, జంగయ్య,కరుణాకర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనరు బొక్క దీక్షిత్‌రెడ్డి, సురుసాని సుదర్శన్‌రెడ్డి, రామక్రిష్ణ, రవీందర్,లు పాల్గొన్నారు.