పదేండ్ల కిందటి కరెంటు కష్టాలు, సాగు బాధలు ఇప్పటికీ కండ్లముందు కదలాడుతున్నాయని, కాంగ్రెస్‌కు ఓటేసి మళ్లీ ఆ కష్టాలను తెచ్చుకోబోమని జిల్లా అన్నదాతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న పంట పెట్టుబడి, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటితో దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంట్ కటకట తప్పదంటున్నారు
కాంగ్రెస్ హయాంలో రాత్రిళ్లు మోటర్లు పెట్టేందుకు బావుల వద్దకు వెళ్లి పాములు, తేళ్లు కుట్టి, విద్యుత్ షాక్‌కు గురై రైతులు ప్రాణాలొదిలిన ఘటనలు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తున్నదంటున్నారు. మూడు గంటల కరెంటు, 10 హెచ్‌పీ మోటర్లు అంటూ కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతుంటేనే పాతరోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. రైతులపై అదనపు భారాన్ని మోపి రుణగ్రస్తులుగా చేసే కుట్రలను తరిమికొడుతామంటున్నారు.
నాడు కరెంట్ ఎప్పుడొస్తదా అని రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి ఉండేదని, నేడు నిరంతర కరెంట్‌తో పండుగలా పంటలను సాగు చేసుకుంటున్నామన్నారు. వ్యవసాయంపై ఏమాత్రం అవగాహనలేని రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన ఓటుకు నోటు, సీట్ల అమ్మకంపై ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై లేదని ఘాటుగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే సాగు పొలాలన్నీ బీడు భూములుగా మారే ప్రమాదముందని, మరోసారి బీఆర్ఎస్నే గెలిపించుకుంటామని చెబుతున్నారు.
-రంగారెడ్డి, నవంబర్ 25(నమస్తే తెలంగాణ)
తెలంగాణ రాక మందు మా ముసలాయన బోరు మోటరు వద్దకు వెళ్లి రాత్రంతా ఇబ్బందిపడేవాడు. ఆ దుస్థితిని మళ్లీ ఇప్పుడు తేవడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. 3 గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అది సాధ్యమేకాదు. సీఎం కేసీఆర్ 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారు. దీన్ని చూసి కాంగ్రెస్ ఓర్వలేకనే పాత రోజులను తేవాలనుకుంటున్నారు. వారి ఆటలు సాగనివ్వం.
– దేవమ్మ, మహిళా రైతు, తీగాపూర్, కొత్తూరు
సీఎం కేసీఆర్ పాలనతోనే కరెంట్ కష్టాలు తప్పినాయి. కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రి కరెంట్ ఇచ్చేవారు. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రైతులందరం వ్యవసాయ బావుల వద్దనే పడుకునేది. కాంగ్రెస్ వస్తే రైతులకు మళ్లీ చీకటి రోజులు వచ్చినట్లే. రైతులను ఇబ్బందులకు నెట్టాలనుకునే కాంగ్రెస్ పార్టీ మాకొద్దు. రైతుల కష్టాలు తెలిసిన నేత, సీఎం కేసీఆర్ పాలనే మళ్లీ కావాలి.
-ఆర్ల బీరప్ప, ఆరుట్ల, మంచాల
రంగారెడ్డి, నవంబరు 25(నమస్తే తెలంగాణ): పదేండ్ల కిందటి కరెంటు కష్టాలు, సాగు బాధల నుంచి గట్టెక్కిన తెలంగాణ రైతాంగం..సొంత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల పూర్తి ఉచిత విద్యుత్తుతో రెండేసి పంటలను పండిస్తూ సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్ హయాంలో పడ్డ కరెంటు కష్టాలను మెల్లమెల్లగా మర్చిపోతున్నారు.
రాత్రిళ్లు కరెంటు కోసం బాయికాడికి వెళ్లి పాములు కరిచి చనిపోయిన ఘటనలు..రాత్రిపూట చేలల్లోనే గడిపిన ఆ కాళరాత్రులు కష్టాలను తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తున్నదని రైతన్నలు వాపోతున్నారు. నాడు పంటలు చేతికిరాక..చేసిన అప్పులు తీరక అన్నదాతలు పడ్డ అగచాట్లను తమ జ్ఞాపకాల్లోంచి తుడిచేసుకున్నారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే ఉరికొయ్యల పాలు కావడం తప్ప మరో మార్గం ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మరోసారి మూడు గంటల కరెంటు అంటుంటే అల్లాడిపోతున్నారు. కరెంటు లేక కండ్ల ముందే పంటలు ఎండిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోయి పడిన యాతనలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
మరోపక్క కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్లుగా రైతులు వ్యవసాయానికి ఉపయోగిస్తున్న 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్ల స్థాయిలో 10 హెచ్‌పీ మోటర్లను బిగించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదని రైతులు పేర్కొంటున్నారు. రైతులపై అదనపు భారాన్ని మోపి రుణగ్రస్తులుగా మార్చే కుట్రలపై రంగారెడ్డి జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇది రైతుల కొంప ముంచే యవ్వారం అని హెచ్చరిస్తున్నారు. శనిలా దాపురించిన కాంగ్రెస్‌ను వదిలించుకుని రైతుల కోసం అహర్నిశలు పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉంటామని రైతాంగం పేర్కొంటున్నది.
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ చీకటి రోజులే. 3 గంటల కరెంటు ఇస్తే ఒక్క మడి కూడా తడవదు. ఎప్పుడొస్తదో తెల్వని కరెంట్‌తో మళ్లీ పడిగాపులు కాయాల్సి వస్తది. కరెంట్ షాక్‌లు, పాములు, తేళ్ల బారినపడి మళ్లీ ప్రమాదాలకు గురికావాల్సి వస్తది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వం. సీఎం కేసీఆర్ వెంటే ఉంటం. రాక్షసుల దోపిడీ రాజ్యం మాకొద్దు. ఎవ్వరూ కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దు. సంక్షేమం, అభివృద్ధి కోసం మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటం. రైతులకు భరోసా కల్పించే కారుగుర్తుకే ఓటు వేస్తం.
– సత్యనారాయణ,శేరిగూడ గ్రామం (శంకర్పల్లి)
మూడుగంటల కరెంట్‌తో ఒక మడి కూడా పారదు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలతో అనేక ఇబ్బందులు పడ్డం. ఇచ్చే ఆరు గంటల కరెంట్ రాత్రి, పగలు సరఫరా చేసేటోళ్లు. పంటలకు నీళ్లు పెట్టేందుకు రాత్రిపూట పొలాలకు వెళ్లి నానా అవస్థలు పడాల్సి వచ్చేది. రైతుబిడ్డగా సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నడు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మరు. అది అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. రైతులతో పెట్టుకున్న వాళ్లు ఎవరూ ముందుకు సాగలేదు. రైతుల సంక్షేమం కోరుకునే బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు. సీఎం కేసీఆర్ వెంటే ఉంటం. మాతోపాటు మరికొందరితో కారుగుర్తుకు ఓటు వేయిస్తం.
– కొత్తపల్లి వెంకట్‌రెడ్డి, రైతు కుమ్మరిగూడ(షాబాద్)
రైతులు బాగుపడడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనట్టుంది. అబద్దపు హామీలను ఇచ్చి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని రైతులు నమ్మే పరిస్థితి లేదు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని చెబుతున్న రేవంత్‌రెడ్డికి అసలు వ్యవసాయం అంటే తెలుసా. వ్యవసాయం చేస్తే ఆ బాధలేందో తెలుస్తయి. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు. రైతులకు అన్నివిధాల సాయమందిస్తున్న సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.
– మర్రి శేఖర్‌రెడ్డి, రాగన్నగూడ (తుర్కయంజాల్)
వ్యవసాయానికి 3హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లనే ఎక్కువగా వాడుతుర్రు. 10హెచ్‌పీ మోటర్లను ఎవరూ వాడరు. 24గంటల కరెంట్‌తో రైతులు మంచిగా పంటలు పండించుకుంటున్నారు. గతంలో రాత్రిళ్లు కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వకుండే. ఇప్పుడైతే నీళ్లు పుష్కలమే.. కరెంట్ పుష్కలమే. రైతుల బాధలు పోయినయ్. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటే ఇస్తే పంటలు ఎలా పండించుకుంటరు. రైతులకు పాత రోజులొస్తాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదు. సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. కారుగుర్తుకే ఓటు వేస్తం.
– సునీల్‌రెడ్డి, వెల్జర్ల గ్రామం (షాద్‌నగర్‌టౌన్)
ఎవుసం చేసినోడికే ఆ కష్టం తెలుస్తది. మూడు గంటల కరెంట్‌తో మూడు గుంటలు కూడా పారదు. 10హెచ్‌పీ మోటరు పెడితే బోర్లల్లో నీళ్లు ఉంటాయా.. అంత తొందరగా ఊట రావద్దా.. కాంగ్రెసోళ్లు తెలిసి మాట్లాడుతుండ్రా.. తెల్వక మాట్లాడుతుండ్రా.. పైగా 10హెచ్‌పీ మోటరు పెడితే లక్ష దాకా ఖర్చవుతది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు అరిగోస పడుతరు. 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్నే గెలిపిస్తాం. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం ఖాయం.
– గూడూరు సురేందర్‌రెడ్డి, (కడ్తాల్)
కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఓటేస్తే రైతులు చీకటిలో గడపాలి. ఆ పార్టీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 10 హెచ్‌పీ మోటరు అంటే అవస్థలే. 3 గంటల కరెంటుతో ఎంత పొలం పారుతది. 24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. మళ్లీ చీకటి రోజులు చూపించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకోము. సీఎం కేసీఆర్‌కు రైతుల మద్దతు ఉన్నది. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తాం.
-వన్నం మహేశ్, పెంజర్ల, (కొత్తూరు)
24 గంటల ఉచిత కరెంట్‌తో హాయిగా వ్యవసాయం చేసుకొని మంచి పంటలు పండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్‌రెడ్డికి వ్యవసాయం మీద కనీస అవగాహన లేదు. చిన్న, సన్నకారు రైతులు 10 హెచ్‌పీ మోటర్లు వాడరు అనే విషయాన్ని గుర్తించాలి. ఒక సాధారణ రైతు 10 హెచ్‌పీ మోటరు వాడాలంటే దాదాపు రూ.లక్ష వరకు ఖర్చు వస్తుంది. ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండ్రు. 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల మద్దతు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుగడలు వేసినా అధికారంలోకి రాదు. సచ్చిన పార్టీ మాటలు మేము నమ్మము. రైతుల సంక్షేమం కోసం కృషి చేసే సీఎం కేసీఆర్‌కే మా మద్దతు. కారుగుర్తుకే ఓటు వేస్తాం.
– కంబాలపల్లి లక్ష్మయ్య, విఠాయిపల్లి, ఆమనగల్లు మున్సిపాలిటీ
మూడు గంటల కరెంటు అంటున్న కాంగ్రెసోళ్లకు ఓటు వేస్తే ఎవుసం ఎండినట్టే. పైగా 10హెచ్‌పీ మోటర్లు పెట్టి ఇక వ్యవసాయం చేసినట్టే.. లక్షల ఖర్చు ఎక్కడి నుంచి తేవాలె. చిన్న, సన్నకారు రైతులు ఎట్లా భరించాలె. ప్రస్తుతం 3, 5హెచ్‌పీ మోటర్లనే వాడుతున్నరు. తెలిసి.. తెలిసి కాంగ్రెస్‌కు ఓటు వెయ్యం. అది అధికారంలోకి రాదు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. సీఎం కేసీఆర్ వెంటే రైతులమంతా నడుస్తం. వ్యవసాయం పండుగలా సాగుతున్నది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతులు రాజులవుతారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూసినా నమ్మేవారు లేరు. కారుగుర్తుకే మాఓటు.
– కడారి నిరంజన్ , జంగారెడ్డిపల్లి (ఆమనగల్లు)