భూముల్లో బండరాళ్లు.. రప్పలు.. చెట్ల పొదలను తీసేసి తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్నాం. అలాంటి భూములను కాంగ్రెస్ సర్కా ర్ గుంజుకోవడం తగదు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే మాకు కన్నీళ్లను మిగు ల్చుతు న్నది. మా బతుకులను రోడ్డు న పడేసిం దని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పోలీసుల భారీ బందోబస్తు మధ్య హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు ఎన్కేపల్లిలోని భూములను సర్వే చేయడంతో భూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
-మొయినాబాద్, జూలై 5
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి, ఎన్కేపల్లిలోని సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాల భూమిని ప్రభుత్వం గోశాలకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇంతవరకు భూములిచ్చిన రైతులకు ప్లాట్లను పరిహారంగా ఇచ్చి పొలాలను తీసుకుందామని ప్రభుత్వం భావించింది. పలుసార్లు రెవెన్యూ అధికారులు రైతులతో చర్చలు జరిపి చివరగా ఎకరానికి 300 గజాల చొప్పుల స్థలం ఇచ్చేందుకు సిద్ధమయ్యా రు. కానీ, రైతులు ఎకరానికి 500 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అధికారులు అంగీకరించలేదు. ప్రభు త్వ ఆదేశానుసారం ఇస్తామని అధికారు లు తేల్చేశారు. రైతులు ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వం ఎలాగైనా ఆ భూములను తీసుకోవాలని సంకల్పించింది.
పోలీస్ పహారాలో భూముల సర్వే
భూములను సేకరించేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రభుత్వం అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకు రావడంతో శనివారం చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, హెచ్ఎండీఏ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య గోశాలకు కేటాయించిన భూముల్లో అధికారులతో సర్వే చేయించారు. భూములకు రెండు వైపుల నుంచి ఉన్న దారిలో పోలీసులు భారీగా మోహరించారు.
భూములను సర్వే చేసినంతవరకు రైతులను ఒక్కరినీ కూడా లోపలికి అనుమతించలేదు. భూమి చుట్టూ సర్వే చేయడంతోపాటు భూమికి ఒక వైపు ఉన్న రోడ్డును సైతం సర్వే చేశారు. రోడ్డును 30 ఫీట్ల వెడల్పు చేస్తూ సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేశారు. భూముల వద్ద పోలీసులు దాదాపుగా 200 మంది మోహరించడంతోపాటు గ్రా మంలోనూ మఫ్టీలో తిరిగారు. భూ ముల వద్దకు వెళ్లేందుకు యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఎన్కేపల్లి గ్రామం పోలీసులతో నిండిపోయింది.
మూడు వందల గజాలకు ఒప్పుకొంటే రేపే ప్లాట్లు
ఎకరానికి మూడు వందల గజాల చొప్పున స్థలాన్ని తీసుకునేందుకు రైతులు ఒప్పుకొంటే ఒక్కరోజులోనే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ఆర్డీవో చంద్రకళ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ భూమిని తీసుకోవడం ఖాయమన్నారు. ఎకరానికి 200 గజాల నుంచి 250 గజాల వరకు స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వ అనుమతితో కలెక్టర్ సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే 300 గజాల వరకు స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ న్నారు. రైతులకు నష్టం జరుగకుండా హెచ్ఎండీఏ లే అవుట్ చేసి, విశాలమైన రోడ్లు వేసి ప్లాట్లుగా చేసి ఇస్తామని ఆమె తెలిపారు. ఇంత కంటే ఎక్కువ ప్రయోజనం పొందాలని అఅనుకుంటే ప్రభుత్వానికి వినతి పత్రాన్ని భూబాధితులు ఇవ్వొచ్చునని ఆమె చెప్పారు.
– చంద్రకళ, చేవెళ్ల ఆర్డీవో