Water Problems | కందుకూరు, మార్చి 8 : వేసవికాలం ప్రారంభంలోనే గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయకపోవడంతో సమస్య తీవ్ర రూపం దాల్చుతుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండుటెండల్లో సైతం తాగునీటి సమస్య రాలేదు. మండలానికి సరఫరా చేసే నీరు గ్రామాలకు చేరడం లేదు. దీంతో ప్రజలు డబ్బులను చెల్లించి ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. వారం రోజుల పైగా నీరు రావడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్కరోజు కూడా నీటి సమస్య లేదని గుర్తు చేశారు.
మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామంలో పది రోజులుగా నేటి సమస్య ఏర్పడింది. నీటి ఎద్దడి ఏర్పడడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. మండల పరిధిలోని ముచ్చర్ల ప్లాంట్ నుండి తమ గ్రామానికి ప్రతిరోజు 1,60,000 వేల లీటర్ల నీరు రావాల్సి ఉండగా కేవలం 50 వేల లీటర్ల నీరు కూడా రావడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. వేసవికాలం రాకముందే తాము తాగునీటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మహిళలు తాగునీటి కోసం ఇబ్బందులు గురి కాకుండా మాజీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ నీటిని తీసుకువచ్చి ఇంటింటికి నల్లాల ద్వారా మహిళలకు సమస్యలు లేకుండా తాగునీరు అందించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మున్నాళ్లకే సమస్య ఏర్పడినట్లు మహిళతో ఆరోపిస్తున్నారు. కొంతమంది మహిళలు చుట్టుపక్కల వ్యవసాయ బావుల వద్ద మరి కొంతమంది ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకొని కాలం వెళ్లబోసుకుంటున్నారు. దీంతో తాగునీటి కోసం కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారు. సమస్య తీవ్ర రూపం దాల్చకుండా తాగునీటిని సరిపడా సక్రమంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు.గునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆ హయంలో గ్రామంలో తాగునీటి సమస్య లేకుండే, మాజీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికి నల్ల ద్వారా నీటిని అందించారు. ఏ ఒక్కనాడు కూడా నీటి సమస్య రాలేదు. తమ గ్రామానికి రావాల్సిన మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పది రోజులైనా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. సమస్యను ఎంపీడిఓ దృష్టికి తీసుకెళ్ళాం .తమ గ్రామం పక్కనే ప్లాంట్ ఉన్న ప్రయోజనం లేదు. ప్రతిరోజు లక్ష అరవై వేల లీటర్ల నీరు రావాల్సి ఉండగా 50 వేల లీటర్ల నీరు కూడా రావడం లేదు. అధికారులు చొరవ తీసుకొని ప్రజలు ఇబ్బందులు పడకుండా నీటిని సరిపడా చేయాలి.
పోలేమోని బాలమణి అశోక్ ముదిరాజ్, మాజీ సర్పంచ్, దాసర్లపల్లి
దాసర్లపల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చకుండా చూడాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సమస్య ఏర్పడినట్లు స్పష్టమవుతుంది. కేసీఆర్ తీసుకొచ్చిన నీటిని సక్రమంగా పంపిణీ చేయకపోవడం బాధాకరం. తమ గ్రామంలో పది రోజులుగా నీరు రాకుంటే ప్రజలు ఎలా జీవిస్తారు. ట్యాంకర్ల ద్వారా డబ్బులు ఖర్చు చేసి నీటిని తెచ్చుకుంటున్నారు. తాగునీటి కి కూడా డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి. సమస్య జఠిలం కాకుండా అధికారులు చొరవ తీసుకోవాలి.
తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, మాజీ ఎంపీటీసీ