పరిగి, ఆగస్టు 26 : ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సమాచారాన్ని అందించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 26, 27 తేదీల్లో సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉందన్నా రు. బూత్ స్థాయి అధికారులు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. శనివారం ప్రారంభమైన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిగిలోని జడ్పీహెచ్ఎస్ నంబర్-1 ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. గ్రామాల్లో చనిపోయిన వారు, డూప్లికేట్ ఓట్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా తమ పేర్లను నమోదు చేయించు కోవాలన్నారు. ఓటరు జాబితాను పారదర్శకంగా సిద్ధం చేయాలన్నారు. అనంతరం ఆయన జడ్పీహెచ్ఎస్ నంబర్-1 పాఠశాలలో మన ఊరు-మ న బడి కింద జరుగుతున్న డైనింగ్‌హాల్ పనులను పరిశీలించారు. పాఠశాలలోని 600 మంది విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. టెన్త్ క్లాస్ విద్యార్థులతో మాట్లాడి బాగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దానయ్య, డిప్యూటీ తహసీల్దార్ నరసింహారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.