ఆమనగల్లు : కోనాపూర్ గ్రామానికి జల్లెల్ల తిరుపతయ్య , పెద్దమ్మ కుమారుడు జల్లెల్ల శివ ( Shiva ) ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 990 మార్కులు ( Inter Ranker) సాధించాడు. ఈ సందర్భంగా కోనాపూర్ గ్రామస్తులు జల్లెల్ల శివను శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్లో మరెన్నో అత్యుత్తమ ఫలితాలు సాధించి గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సన్మానించిన వారిలో జగన్ తదితరులు ఉన్నారు.