కేశంపేట : వర్షానికి విరిగిపడ్డ రహదారిపై అడ్డంగా చెట్లను తొలగించకపోవడాన్ని గమనించిన బీఆర్ఎస్ నాయకులు ( BRS leaders) మానవతాదృక్పథంతో చెట్లను తొలగించి రాకపోకలకు మార్గం సుగమమం చేశారు. బీఆర్ఎస్ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 3న కురిసిన వర్షానికి ( Rains ) మండలంలోని కోనాయపల్లి – కొత్తపేట గ్రామాల ప్రధాన రహదారిపై చెట్లు అడ్డంగా పడ్డాయని, ఈ విషయమై ఆరు రోజులుగా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.
వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జేసీబీ సహాయంతో విరిగిపడిన 40 చెట్లను తొలగించామన్నారు. బీఆర్ఎస్ నేతలు సేవాదృక్పథంతో స్పందించడంపట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందిచారు. ఈ కార్యక్రమంలో హన్మంత్నాయక్, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.