బంట్వారం : బావిలో పడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన కిష్టాపురం బాలమ్మ (45) మనస్థాపానికి గురై ఆదివారం రాత్రి పోలేపల్లిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విమల తెలిపారు.
సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పేర్కొన్నారు. కాగా, మృతురాలు బాలమ్మ గత కొన్నేళ్లుగా స్థానిక పోలీస్ స్టేషన్లో స్వీపర్‌గా పనిచేసింది దీంతో ఎస్ఐ విమల సోమవారం అంత్యక్రియల నిమిత్తం 15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు.