కులకచర్ల, జూన్ 7 : వికారాబాద్ జిల్లాలో ఆడపిల్ల వివాహానికి పటేల్చెరువు తండా గ్రామ మాజీ సర్పంచ్ శాంతి తులసీరామ్ చేయూతనిచ్చారు. తనవంతుగా ఆడపిల్ల తల్లిదండ్రులకు సరుకులను అందజేశారు.
కులకచర్ల మండల పరిధిలోని పటేల్చెరువు తండా గ్రామ పంచాయతీ పోటిగడ్డతండాలో విస్లావత్ తులసీబాయి, రాజు నాయక్ దంపతుల కుమార్తెకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి క్వింటాల్ సన్న బియ్యం, 15 కిలోల నూనెను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శాంతి తులసీరామ్ మాట్లాడుతూ.. తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఆడబిడ్డ వివాహం జరిగితే తనవంతుగా సరుకులు అందజేస్తున్నానని తెలిపారు.