జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను గులాబీ శ్రేణులు పూర్తి చేశాయి. ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, షాద్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాల వ్యాప్తంగా ముఖ్య కూడళ్లు, వివిధ కేంద్రాల్లో పార్టీ తోరణాలను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆమనగల్లు, ఏప్రిల్ 26 : వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా జెండాలను ఎగురవేయాలన్నారు. గులాబీ జెండా కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో శ్రేణులు జరుపుకోవాలన్నారు.
షాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు పండుగలా నిర్వహిస్తున్నట్లు షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు గులాబీ జెండాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. మండలంలోని 41 గ్రామ పంచాయతీల పరిధిలో పార్టీ శ్రేణులు బుధవారం గులాబీ జెండాలు ఎగురవేయనున్నట్లు తెలిపారు.
14 ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పార్టీ ప్లీనరీలో పలు అంశాలపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్‌లో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే షాబాద్‌లో కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు స్పష్టం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్‌రావు, శ్రీరాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, సర్పంచ్‌లు మల్లేశ్, కృష్ణ, నాయకులు దర్శన్, గణేశ్, గోపాల్, భూపాల్‌రెడ్డి ఉన్నారు.
ఆవిర్భావ వేడుకలకు అంతా సిద్ధం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 26 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బుధవారం నిర్వహించనున్న టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు అంతా సిద్ధం చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో జెండావిష్కరణతో పాటు పలు సేవా కార్యక్రమాలను చేపట్టడానికి కార్యకర్తలు సన్నద్ధ్దమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పార్టీ దిమ్మెలకు గులాబీ రంగులు వేశారు. ఇబ్రహీంపట్నంలోని వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు, దవాఖానలో రోగులకు పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు.
పార్టీ జెండాలను ఎగురవేయాలి
శంకర్పల్లి : ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేయాలని టీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్‌కన్నా ఒక ప్రకటనలో కోరారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.
అధిక సంఖ్యలో పాల్గొనాలి
చేవెళ్లటౌన్ : మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ తెలిపారు. చేవెళ్లలో ఉదయం 8 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరవుతున్నట్లు తెలిపారు.
వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలి
ఇబ్రహీంపట్నంరూరల్ : ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్‌రెడ్డి అన్నారు. గ్రామ గ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడే విధంగా కార్యక్రమాలు పూర్తిచేసినట్లు తెలిపారు.
మొయినాబాద్ : ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా పార్టీ జెండాలను ఎగురవేయాలన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలన్నారు. అనంతరం బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు.
కొత్తూరు రూరల్ : పార్టీ ఆవిర్భావ వేడుకలను వాడవాడలా పండుగలా జరుపుకోవాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్ అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
యాచారం : టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులు సమావేశమై ఆవిర్భావ దినోత్సవానికి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం లో జెండాలను ఆవిష్కరించాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష కోరారు.