కొత్తూరు, ఏప్రిల్ 22 : సేంద్రియ వ్యవసాయంతో భూమికి మేలు జరుగుతుందని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఏవీ రామాంజనేయులు అన్నారు. మండలంలోని ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దత్తత గ్రామం గూడూరులో ధరిత్రి దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. రసాయన ఎరువులు తగ్గిస్తూ, సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. పరమేశ్వరి, డా. అరుణ, మండల వ్యవసాయ అధికారి గోపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శకుంతల దేవి, ఉస సర్పంచ్ దయానంద్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
ఘనంగా ధరిత్రి దినోత్సవం
చేవెళ్లటౌన్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ధరి త్రి దినోత్సవాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, భూసార పరిరక్షణ, ఓజోన్ పరిరక్షణ, జీవనవై ద్యం మొదలకు అంశాల గురించి చేవెళ్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్లయ్య, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ జ్యోతి వివరించారు. విద్యార్థులకు డ్రాయింగ్, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖనం నిర్వహించారు. ప్రతిభ కనబర్చి న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్, విద్యార్థులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలి
ఆమనగల్లు : పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని సర్పంచ్ శోభ కోరారు. శుక్రవారం మండలంలోని కొత్తకుంట తండాలో ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని పంచాయతీ ఆవరణలో పాలక సభ్యులతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాన్యానాయక్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి, మాజీ ఎంపీటీసీ చందూనాయక్, వార్డు సభ్యులు సురేశ్, లక్ష్మి పాల్గొన్నారు.
కడ్తాల్ : గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. మానవాళి మనుగడకు వృక్షాలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు నరేందర్‌రెడ్డి, మల్లయ్య, భిక్షపతి, నాయకులు రాంచంద్రయ్య, రాంచందర్, బాలయ్య, కార్యదర్శి రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.