పరిగి, మార్చి 31: ఉద్యోగార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్‌లోని జిల్లా గ్రంథాలయంలో రాష్ట్రంలో ఎంపిక చేసిన 110 గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు పూర్తిస్థాయిలో మెటీరియల్‌ను అందుబాటులో ఉం చడంతోపాటు కోరుకున్న పుస్తకాలను సమకూర్చే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి, అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు తెలిపారు. ఉద్యోగార్థులు చదువుకునేందుకు వీలుగా వారు కోరిన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచేందు కు గ్రంథాలయ పరిషత్ ఏర్పాట్లు చేసిందన్నారు. తద్వారా పేద ఉద్యోగార్థులకు చదువుకునేందుకు మంచి అవకాశం కలుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఉచిత శిక్షణా తరగతులను కొనసాగిస్తారని, వాటిని నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా జోనల్ వ్యవస్థ ఏర్పాటుచేసి 95 శాతం ఉద్యోగాలు జిల్లా వాసులకే దక్కేలా సీఎం కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో 12 అంశాలకు సంబంధించిన మౌలిక వసతులను కల్పించడంతోపాటు గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుందన్నారు. ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ బడుల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఒక్కో రంగంపై తన దృష్టిని కేంద్రీకరిస్తున్నారని మంత్రి తెలిపారు. అనంతరం రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను అన్ని గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు.
పాఠకులు, ఉద్యోగార్థులు చదువుకునేందుకు వీలుగా వారు కోరిన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ మురళీకృష్ణాగౌడ్ మాట్లాడుతూ వికారాబాద్‌తోపాటు ఎంపిక చేసిన అన్ని గ్రంథాలయాల్లో అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, కలెక్టర్ నిఖిల, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
కార్పొరేట్‌కు దీటుగా..
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాంద్రారెడ్డి అన్నారు. మొయినాబాద్‌లోని శంకర్పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు ప్రిన్సిపాల్ జయమ్మ అధ్యక్షతన గురువారం వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథులుగా మంత్రి సబితారెడ్డితోపాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబితారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం లో 405 జూనియర్ కళాశాలలు ఉంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత 1050 కళాశాలలను ఏర్పాటు చేసినట్లు, మహిళలకోసం 53 గురుకుల డిగ్రీ కళాశాలలను ప్రభు త్వం ఏర్పాటు చేసిందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, తహసీల్దార్ అనితారెడ్డి, ఎంపీడీవో సంధ్య, సీఐ లక్ష్మీరెడ్డి, ఎస్ఐ శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజాదర్బార్‌కు ఆరు దరఖాస్తులు
కొడంగల్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి ఆరు దర ఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. వాటిలో మూడు దరఖా స్తులను అక్కడికక్కడే పరిష్కరించి, రెండు దరఖాస్తులకు సంబంధిత శాఖల అధికారులకు పంపించి, ఒక దరఖాస్తును తిరస్కరించినట్లు ఆయన తెలిపారు.