వికారాబాద్, మార్చి 31: వికారాబాద్ మున్సిపాలిటీకి మరో ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉందని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తెలిపారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కౌన్సిల్ హాలులో ర్యాంక్ సాధించిన సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ఆస్తి పన్నులు వసూలు చేయడంలో మున్సిపల్ ఆర్ వో, బిల్ కలెక్టర్లు తీవ్రంగా కృషి చేశారన్నారు. 2021-22 మార్చి ఆర్థిక సంఘం ప్రకారం రూ.3,32,53,000 లక్ష్యం ఉండగా, రూ. 3,12,63,000 పన్నులు వసూళ్లు చేశామన్నారు. దీంతో 94.02శాతం పూర్తి చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలలో వికారాబాద్ మున్సిపాలిటీ 8వ స్థానంలో నిలువడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ మధ్య స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా వికారాబాద్ మున్సిపల్‌కు రాష్ట్రంలో 4వ స్థానం, సౌత్ ఇండియా జోన్లో 16వ స్థానం సాధించామని గుర్తు చేశారు. హరిత హారంలో 4వేల మొ క్కలు నాటడంతో ఇండియన్ ఎక్స్‌లెన్స్ రికార్దు సైతం మున్సిపల్‌కే దక్కిందని వివరించారు. ర్యాంక్‌లు సాధించేందుకు మున్సిపల్, అధికారులు, సిబ్బంది, శానిటేషన్ కార్మికుల శ్రమ ఉం దని పేర్కొన్నారు. మున్సిపల్‌కు మరో ర్యాంక్ రావడానికి సహకరించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బిల్ కలెక్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్బబేగం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, కౌన్సిలర్ స్వాతి, టీపీవో, ఏఈ, ఆర్వో శివ, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.