వికారాబాద్, మార్చి 22 : జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాలోని కరణ్‌కోట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామ పరిధిలో కొందరు పేకాట ఆడుతున్న 17 మంది పట్టుకున్నారు. వారి నుంచి 10 బైక్‌లు, 15 సెల్ఫోన్లు, రూ.7,660 నగదు స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారన్నారు. తాండూరు టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ చేస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారన్నారు. ఉపయోగించే 9 అనుబంధ సిలిండర్లు, 27 చిన్న సిలిండర్లు లభించాయన్నారు. వారిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వికారాబాద్ పట్టణంలో దాడులు చేయగా గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ కోసం ఉపయోగించే 11 సిలిండర్లను సీజ్ చేశామన్నారు. వీరిపైన వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. టాస్క్ ఫోర్స్ బృందానికి మోమిన్‌పేట సీఐ వెంకటేశం ఇన్చార్జిగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఏమైనా సమాచారం ఉంటే 9492009094 నంబర్‌కు సమాచారం అందివ్వాలన్నారు.