వికారాబాద్, మార్చి 22: ప్రజల సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ సూచించారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని రాళ్లచిట్టంపల్లి గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పర్యటించి పలు సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొల గించాలని, ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నూతనంగా ఏర్పాటైన కాలనీలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయడంతో పాటు, నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.
రైతు వేదికలలో వ్యవసాయ శాఖ అధికారులు వారానికి ఒక సారి రైతులకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. పశువుల డాక్టర్ వారానికి ఒక సారి ఉదయం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కొవిడ్ టీకాలు ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రమోదిని, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ఎంపీవో నాగరాజు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు గయాజ్, ఎంపీటీసీ గౌసోద్దీన్, సర్పంచులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి పలువురు కాంగ్రెస్ నాయకులు..
వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్పల్లి మం డలం బూచన్‌పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలంరెడ్డి, రఘుపతిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రవీందర్‌రెడ్డి, నాగ వర్దన్‌రెడ్డి తదితరులు ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు.