
వికారాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): జిల్లాలో నాలుగో విడుత పల్లె ప్రగతికి ఏర్పాట్లు పూర్తి అయ్యా యి. నేటి నుంచి పది రోజుల పాటు గ్రామ పంచాయతీల్లో చేయాల్సిన పనులపై ప్రణాళిక రూపొందించారు. జిల్లాలోని 19 మండలాల్లోని 566 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఏడో విడుత హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాకు ప్రతి నెల ప్రగతి కింద 566 గ్రామాలకు రూ.7కోట్ల 91లక్షలు నేరుగా గ్రామాలకు నిధులు మంజూరు అయ్యాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ప్రతి నెల రూ.1కోటి 60లక్షల నిధులు నేరుగా జమ అవుతున్నా యి . ప్రతి ఇంటికి ఆరు మొక్కలను వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్లు స్వయంగా వెళ్లి అంద జేయాలని ఆదేశాలు న్నాయి.
జిల్లాలోని ఎమ్మెల్యేలు,మున్సిపల్ చైర్మన్లు, సభ్యులు అధికారులతో కలిసి పల్లెలు, పట్టణాలల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్య క్రమాల్లో భాగంగా గురువారం జిల్లాలో కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డిలు పాల్గొననున్నారు. గత పల్లె ప్రగతిలో వెనుకబడిన గ్రామాలపై ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ పౌసుమిబసు అధికారులతో, ప్రజా ప్రతి నిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. ఈ పనుల పర్యవేక్షణ బాధ్యతలను మండలానికో ప్రత్యేక అధికారికి అప్పగించారు. అలాగే గ్రామ పంచా యతీ స్థాయిలో కార్యక్రమ నిర్వహణకు ఒక బృందం ఉంటుంది. ఇందులో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ,వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ, లైన్మన్ (విద్యుత్ శాఖ), మిషన్ భగీరథ, సాం కేతిక సహాయకుడు సభ్యులుగా ఉంటారు. ఈ బృందం గ్రామ సభ నిర్వహించి చేపట్టాల్సిన పనుల ప్రణాళికను రూపొందించింది.
గ్రామ పంచా యతీల్లో చేపట్టే పనులకు సంబంధించి యాక్షన్ ప్లాన్ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యం, ఆరోగ్యం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, హరితహారం కార్యక్రమ నిర్వహణ,విద్యుత్ సరఫరాలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు మూడు విడుతలు పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించగా.. అందులో పారి శుధ్య పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. మూడు విడుతల్లో పెండింగ్లో ఉన్న పను లను నాలుగో విడుతలో పూర్తి చేయడంతో పాటు గ్రామ సభ ద్వారా తీర్మానించిన కొత్త పనులు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.పల్లె ప్రగతి బృందం ప్రతి రోజూ ఉదయమే గ్రామ పంచాయతీకి చేరుకుని కార్యక్రమాలు చేపట్టాలి.ఈ పను లను కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నిరంతరం పర్య వేక్షించి ..క్షేత్రస్థాయి సందర్శనలు చేస్తారు. దీంతో పనులు ఆలస్యం కాకుండా జరిగేందుకు వీలు కలుగ నుంది.‘బృహత్ పల్లె ప్రకృతి వనం’ ఏర్పాటు చేయడానికి అన్ని మండలాల్లో స్థలాలు గుర్తించాలి. విద్యుత్ సమస్యలను పరిష్కారం కోసం ఒకరోజు ‘పవర్ డే’ నిర్వ హిం చి.. వంగిపోయిన,తుప్పు పట్టిన,విరిగిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తారు.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 8 నర్సరీలు ఏర్పాటు చేశారు.28 మరుగుదొడ్లు నిర్మించారు. 16 పార్కులు ఏర్పాటు చేశారు. నాలుగు డంపింగ్ యార్డులను, ఆరు వైకుంఠధామాలు నిర్మించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి రూ.4కోట్లు మంజూరు చేయగా నిర్మాణంలో ఉంది. అధునాతన వైకుంఠ ధామానికి రూ.92లక్షలు కేటాయించారు. తాండూరులో రూ.7.70 కోట్లు మంజూరు చేయగా..రూ.3.90కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా . నాటిన మొక్కల ఫొటో తీసి జియో ట్యాగిం గ్ చేయాల్సి ఉంటుంది. డీఆర్డీవో,అటవీ శాఖలు ఇప్పటికే జియో ట్యాగింగ్ చేస్తుం డగా..మిగతా శాఖలు కూడా తాము నాటే మొక్కలను జియో ట్యాగింగ్ చేయ నున్నా యి. జిల్లాలో 40, 25,706 మొక్కలు నాటాలనే లక్ష్యం నిర్ధే శించుకున్నారు. అటవీ, డీఆర్డీవోలతో పాటు మరో 21 ప్రభుత్వ శాఖలను భాగస్వాములను చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆయా శాఖలకు మొక్కలు నాటే లక్ష్యాలను నిర్ధేశించారు. జిల్లాలో లక్ష్యానికి మించి మొక్కలు సిద్ధం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 566 నర్సరీల్లో 47లక్షల మొక్కలు సిద్థం చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 22 నర్సరీల్లో 9.22 లక్షల మొక్కలు సిద్ధం చేశారు. మొక్కలు నాటేం దుకు వీలుగా జిల్లాలో ఇప్పటి వరకు 5.50లక్షల వరకు గుంతలు పూర్తి అయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో సర్వం సిద్ధం
షాబాద్, జూన్ 30: రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 556 గ్రామ పంచాయతీలతో పాటు 12 మున్సిపాలిటీలు, నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలో పారిశుధ్య కార్యక్ర మాలు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అధికారులు సమావేశాలు నిర్వహించి కార్యక్రమం విజయవంతం చేసేలా సిబ్బంది, ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఆయా గ్రామాల్లో, కాలనీల్లో ఇప్పటికే హరితహా రం మొక్కలు నాటేందుకు సిబ్బందితో గుంతలు తవ్వించి సిద్ధంగా ఉంచారు. రోజు వారి షెడ్యూల్ ప్రకారం పదిరోజుల పాటు పల్లె, పట్టణ ప్రగతి ద్వారా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రతి ఇంటికి ఆరుమొక్కలు పంపిణీ చేయనున్నారు. గురువారం నుంచి పదిరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని పల్లెల్లో, పట్టణాల్లో ఉద్యమంలా పారిశుధ్య కార్య క్రమాలు, హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నారు.