దోమ, నవంబర్ 27: దోమ మండల కేంద్రానికి చెందిన కొడి గంటి పోషయ్య(45) కొంత కాలంగా ఫిట్స్‌తో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ లక్ష్మయ్యముదిరాజ్తో కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరమార్శించి ఐదు వేల రూపా యల ఆర్థిక సాయం అందజేయగా, కేఎస్ఆర్ ట్రస్టు చైర్మన్ శరత్‌కుమార్‌రెడ్డి పోషయ్య పది వేల రూపాయల ఆర్థిక సా యం అందజేశారు. అదే విధంగా మోత్కూర్ గ్రామానికి చెం దిన బుద్దారపు అంజిలయ్య(55) కొంత కాలంగా అనా రోగ్య ంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. కేఎస్ఆర్ ట్రస్టు చైర్మన్ శరత్‌కుమార్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరమార్శించి పది వేల రూపాయలు ఆర్థిక సాయం అంద జేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ యాద య్యగౌడ్, డప్పు చంద్రశేఖర్, దోమ వార్డు సభ్యులు రమేశ్, కృష్ణ, కేఎస్ఆర్ ట్రస్టు నాయకులు ధ్యానమోని శ్రీనివాస్,విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని రాంపూర్ గ్రామం లో ఆత్మహత్య చేసుకున్న చెక్కల శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి ఆర్థిక సాయాన్ని కార్యకర్తల ద్వారా అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మంచమోని గోపాల్, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, ఉపసర్పంచ్ చెక్కల తిరుపతయ్య, రాములు పాల్గొన్నారు.