మోమిన్‌పేట, జూన్ 16: నూతన ఇంటి నిర్మాణ అనుమతుల కోసం, మరణ ధ్రు వీకరణ పత్రాలకోసం ప్రజల నుంచి డబ్బులు తీసుకోవడంతో మండలంలోని మేకవనంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న శ్రావణికి వికారాబాద్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఎల్పీవో అనిత తెలిపా రు. గురువారం ఆమె మేకవనంపల్లి గ్రామ పంచాయతీలో ఎంపీడీవో శైలజారెడ్డి, సర్పంచ్ శశిధర్‌రెడ్డి సమక్షంలో షోకాజ్ నోటీసులపై విచారణ చేపట్టారు.గ్రామానికి చెందిన శశికళ నుంచి నూతన ఇంటి నిర్మాణ అనుమతుల కో సం రూ. లక్ష, శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి అతడి తల్లి మరణ ధ్రువీకరణ పత్రం కోసం రూ. మూడు వేలు తీసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో యాదగిరి, అధికా రులు, బాధితులు పాల్గొన్నారు.