మహేశ్వరం, జూన్ 5: అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సిరిగిరిపురం గ్రామానికి చెందిన బీజేపీ మహిళా అధ్యక్షురాలు గండికోట అలివేలుతో సహా బీజేపీ సీనియర్ నాయకులు తడకల నర్సింగ్, తడకల మహేశ్, గండికోట నరేశ్, గండికోట పరశురామ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణ, పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారుతున్నాయని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు రాజకీయాలకు అతీతంగా అందుతున్నాయని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు దయాల శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షుడు రాములు, నాయకులు సురేశ్‌గౌడ్, బండ నర్సింహ, వెంకటేశ్‌గౌడ్, కన్నయ్య, బాబు, వినోద్, శ్రీనివాస్, లింగం, సత్తయ్య పాల్గొన్నారు.