
వికారాబాద్ జూన్ 27: వికారాబాద్ జిల్లాలో ప్రభు త్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డిజిల్లాకు చెందిన శాసన సభ్యులతో కలిసి వికారాబాద్ జిల్లాలో వైద్య కళా శాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు మంత్రి వినతిపత్రం అందజేశారు. నూ తనంగా ఏర్పడిన జిల్లానే కాకుండా, వికా రాబా ద్ జిల్లా వెనుకబడిన ప్రాంతమని, పేద ప్రజలకు సత్వర వైద్యం అందించేందుకు వీలుగా దవాఖా నతో కూడిన వైద్య కళాశాలను మంజూరు చే యాలని ప్రజాప్రతినిధులు కోరారు. వెనుకబడిన ప్రాం తాల్లో వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచినందున వికారాబాద్ జిల్లా ను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. వికారాబాద్ జిల్లాను గద్వాల జోగు లాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్‌కు మార్చి నందుకు జిల్లా శాసన సభ్యులు సీఎంకు కృత జ్ఞతలు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటైతే రాష్ట్రంలో వైద్య సీట్లు పెరుగుతాయని, పేద వర్గాలకు మెరుగైన వైద్యం చేరువతుందని మంత్రి పేర్కొన్నారు. వికారా బాద్ జిల్లాలో ఇప్ప టికే వైద్యపరంగా అనేక చర్య లు తీసుకున్నారని కళాశాలతో పూర్తి స్థాయి మెడికల్ హబ్‌గా మా రుతుందన్నారు. సీఎంను కలిసిన వారిలో మూసీ తీరప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్ సుధీ ర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, పట్నం నరేం దర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, ఎమ్మె ల్సీలు మల్లేశం, దయానంద్ తదితరులున్నారు.
తాండూరు సమస్యలపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్‌రెడ్డి ఆదివారంహైదరాబాద్లోని టీఆర్ ఎస్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ను కలిశారు. తాండూరు ప్రాంత సమస్య లను విన్నవించారు. ముఖ్యంగా తాండూరులో మెడి కల్ కళాశాల, సబ్కోర్టుతో పాటు తట్టెపల్లిని మం డల కేంద్రంగా చేయాలని వినతి పత్రం అం ద జేశారు. ఇందుకు సీఎం కేసీఆర్ సాను కూలం గా స్పందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. తాండూరు అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటించినట్టు వివరించారు.