తాండూరు : సీఎం కేసీఆర్‌ను తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరు అభివృద్ధి పనులు, సంక్షేమ నిధులతో పాటు పార్టీ గురించి చర్చించినట్లు సమాచారం. తాండూరుకు గతంలో ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీల మాదిరిగా ప్రస్తుతం తాండూరు అభివృద్ధి, రోడ్లకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే కోరడంతో సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.