మహేశ్వరం : విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Reddy) అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని ఘట్టుపల్లి మండల పరిషత్ పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం బీటీ రోడ్డు పనులను పరిశీలించి, చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వ హయాంలో మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ఎంతో కృషి చేసినట్లు తెలిపారు.
నియోజక వర్గాన్ని విద్యానిలయంగా మార్చి విద్యావ్యవస్థలో మార్పు తీసుకువచ్చానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నియోజక వర్గంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న 11 గొలుసుకట్ట చెరువుల(Ponds) అభివృద్ధికి కృషి చేసి సత్ఫలితాలు సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు అనితా ప్రభాకర్‌రెడ్డి, థామస్‌రెడ్డి, ముక్కెర యాదయ్య, మెగావత్రాజునాయక్ నాయకులు జాన్‌రెడ్డి, వెంకటేశ్‌యాదవ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.