ధారూరు,డిశంబరు 31 : వికారాబాద్ జిల్లా పరిధిలోని కోట్పల్లి గ్రామ నూతన సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై దాడి హీయమైన చర్య అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పోందుతున్న సంగయ్య స్వామిని ఆయన పరామర్శించారు. సంగయ్య స్వామి ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుక్నురు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. సంగయ్య స్వామి త్వరగా కోలుకోవాలి ఆకాంక్షించారు.
సంగయ్య స్వామి భార్య బసమ్మ, కొడుకు రాజశేఖర్ ను కలిసి ధైర్యం చెప్పారు. సర్పంచ్ భర్తపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు లేదన్నారు. సంగయ్య స్వామి ఆర్థిక పరిస్థితి బాగా లేదని..ఆయన వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు. రాజకీయల్లో గెలుపు ఓటమలు సహజమన్నారు.
ఎన్నికల్లో ప్రజా తీర్పను ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గు చేటన్నారు. రాజకీయాలలో వాదాలు, సంవాదాలు ఉండాలి కానీ కక్షలు, దాడులు ఉండరాదని అన్నారు.ఇది తెలంగాణ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పెడధోరణి అని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన బాధ్యులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.