దోమ, మే, 28: లైసెన్సు కలిగిన ఫెర్టిలైజర్స్ షాపులోనే విత్తనాలు కొనాలని ఏడీఏ శంకర్ రాథోడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాపులను కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేసి షాప్ లలోని విత్తనాలు, మందులను రికార్డులు లైసెన్సు లకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు లైసెన్సు కలిగిన మందుల షాపులలోనే విత్తనాలను, మందులను కొని నష్టాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
యజమానులు నకిలీ విత్తనాలను అమ్మినట్లయితే వారిపై చర్యలు తీసుకొని లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. షాపులో యజమానులు ప్రతి వస్తువును ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని సూచించారు. ఎరువుల బస్తాలను ఈపీఓఎస్ మిషన్ ల ద్వారా ఆధార్ కార్డు నెంబర్లు ఏంటర్ చేసి దానికి అనుగుణంగా ఎరువులను అమ్మాన్నారు. షాపులలో ఉన్న ఎరువుల బస్తాలను ఈపీఓఎస్ మిషన్లో అమ్మిన ఎరువుల బస్తాలను సరి చూసి పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో ప్రభాకర్ రావు, పోలీస్ అధికారి నర్సింహులు, ఆయా షాపుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.