కులకచర్ల, ఆగస్టు 7 : స్టేట్ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్బిఐ ఆర్ఎం నితిన్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో కులకచర్ల ఎస్బిఐ ఆద్వర్యంలో బ్యాంకు సేవలపై అవగాహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జన్సురక్ష బీమాపై పూర్తి స్థాయిలో అవగాహణ కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేట్ బ్యాంకు ద్వారా వివిద సేవలను అందిస్తున్నామని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని సూచించారు.
బ్యాంకు సేవలు తెలియక చాలా మంది ఖాతాదారులు వాటిని వినియోగించుకోలేక పోతున్నారని అన్నారు. పూర్తి స్థాయి సమాచారం కోసం స్టేట్ బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బ్యాంకు సేవలపై పూర్తి స్థాయిలో అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల స్టేట్ బ్యాంకు మేనేజర్ గోపాల్ సింగ్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.