పరిగి, నవంబర్ 10 : ఆర్టీసీ డిపో నుంచి బయటకు వస్తున్న బస్సు బ్రేక్ ఫెయిలై ఓ మెకానిక్ ప్రాణం తీసింది. ఈ సంఘటన పరిగిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సోమవారం ఉదయం బస్సు బస్టాండ్‌కు వెళ్లి అడవివెంకటాపూర్ వెళ్లడానికి డ్రైవర్ వెంకటయ్య బస్సును డిపో నుంచి బయటకు తీస్తున్నారు. ఈ సందర్భంగా బస్సు బ్రేక్ ఫెయిలవడంతో డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న ఖుద్దూస్‌ను ఢీకొన్నది.
ఖుద్దూస్‌కు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఖుద్దూస్‌కు మరో 20 నెలల సర్వీసు ఉన్నట్లు సమాచారం. డిపోలో బస్సు ఢీకొని మెకానిక్ మృతిచెందడంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.