ప్రేమంటే శృంగారము కాదు
అంగారము కాదు
తరుగెరుగని బంగారము
ప్రేమంటే మోహము కాదు
వ్యామోహము కాదు
అలౌకికానందము
ప్రేమంటే శరీరము కాదు
శారీరక వాంఛా కాదు
నిష్కల్మశ ప్రవాహము
ప్రేమంటే పండు కాదు
సలుపే పుండు కాదు
తొణకని నిండు ఘటము
ప్రేమంటే భోగము కాదు
త్యాగము కాదు..అవ్యక్తానురాగము
ప్రేమంటే రణము కాదు
ఋణము కాదు
ప్రశ్నించే అంతరంగం
ప్రేమంటే అమ్మేది కాదు
కొనేది కాదు
సువిశాల మైదానము
ప్రేమంటే మతము కాదు
సతమతము కాదు
విశ్వజన హితము
ప్రేమంటే నటనము కాదు
యుగళగీతము కాదు
సంస్కార సద్భావము
ప్రేమంటే డబ్బు కాదు
జబ్బు కాదు
మబ్బు విరగడము
ప్రేమంటే విత్తనము కాదు
క్షేత్రము కాదు
సమత మమతల పథము
ప్రేమంటే విషము కాదు
అమృతము కాదు
బిందువు సింధువైన చరితము
-నమిలకొండ నాగేశ్వర్రావు
8688553470