Prathik Jain | అర్జీలు అందించేవారితో సున్నితంగా వ్యవహరించాలి.. రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచనలు
Prathik Jain | భూ సమస్యలను సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సులోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ప్రతీక్ జైన్ ఆకస్మికంగా సందర్శించారు. అర్జీదారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
Prathik Jain | వికారాబాద్, జూన్13: భూ సమస్యలను సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సులోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ప్రతీక్ జైన్ ఆకస్మికంగా సందర్శించారు. అర్జీదారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివరాల నమోదులో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ నమోదు రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలని అన్నారు.
తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని అన్నారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

