కడ్తాల్, జూన్ 17 : సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యే యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో తహసీల్దార్ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన 43 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపడుచు పెండ్లి సమయంలో తల్లిదండ్రు లు ఇబ్బందులు పడవద్దనే సంకల్పంతో, సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
మండల అభివృద్ధికి ప్రత్యేక కృషి
కడ్తాల్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో అన్ని శాఖల కార్యాలయాల భవనాలను నిర్మిస్తున్నామన్నారు. మండలంలో ఎంపీడీవో కార్యాలయం నిర్మాణానికి రూ. 1.50 కోట్లు, వ్యవసాయశాఖ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.కోటి, రూ.68 లక్షలతో నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి అదనంగా మరో రూ.కోటి మంజూరయ్యయాని ఎమ్మెల్యే తెలిపారు. కడ్తాల్ మండల కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరామని గుర్తు చేశారు. కడ్తాల్‌లో సీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మండలంలోని ముద్విన్, రావిచేడ్, కడ్తాల్, కర్కల్‌పహాడ్, చల్లంపల్లి గ్రామాల్లో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తామని వివరించారు.
ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల్, తలకొండపల్లి మండలాల్లోని కొత్త గ్రామ పంచాయతీల్లో నూతన భవనాల నిర్మాణాలకు రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.56.14 కోట్లు మంజూరు కానున్నాయని వివరించారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, రైతు సమన్వయ సమితి కమిటీ జిల్లా సభ్యుడు పరమేశ్, మండలాధ్యక్షుడు వీరయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌లు కృష్ణయ్యయాదవ్, రవీందర్‌రెడ్డి, తులసీరాంనాయక్, భారతమ్మ, భాగ్యమ్మ, కమ్లీ, సుగుణ, సులోచన, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, మంజుల, ప్రియ తదితరులు పాల్గొన్నారు.