Sonu Sood | కందుకూరు : సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాడుపడాలని సినీనటుడు సోనుసూద్ (Actor Sonu Sood ) పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కందుకూరు మండల పరిధిలోని గూడూరు గేటు వద్ద ఉన్న ప్రభుత్వ ఎస్సీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. రాఖీ పండుగ సందర్భంగా విద్యార్థినులతో రాఖీలు(Rakhi) కట్టించుకున్నారు.

అనంతరం ఆయన మ్యాక్ప్రాజెక్టులో మొక్కలు(Plantation) నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించాలని (Protect ) కోరారు. రాష్ట్రం పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని కోరారు. మండల పరిధిలోని మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఆసీఫ్ అలీ నిర్మిస్తున్న తురుంఖాన్ చిత్రంలో సోనుసూద్ నటిస్తున్నారు.
ఆయన వెంట మహమ్మద్ ఆసీఫ్ అలీ, బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు కొలను విజేశ్వర్రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, యూత్ నాయకులు గొర్రెంకల రామక్రిష్ణా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.