వికారాబాద్, నవంబర్ 26 : 4 కార్మిక కోడ్ లను, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రం లో సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, ఆల్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆలిండియా కమిటీ పిలుపులో భాగంగా నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి దారిలో అమలు చేయడానికి తెచ్చిన ఆర్డినెన్స్‌లు ఉపసంహరించుకొవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయకార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం చేయాలన్నారు.
ఇంకా తెలంగాణ రైతు సంఘం(ఏఐకేఎస్) జిల్లా కార్యదర్శి మద్దులపల్లి సుదర్శన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ(ఏఐఏడబ్ల్యూయూ) జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప, సిఐటియు(సీఐటీయూ) జిల్లా అధ్యక్షులు రామక్రిష్ణ, రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మహిపాల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రయ్య, వ్యకాస రఘు, సత్యయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీష్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, టీజీఎస్ నాయకులు శ్రీనివాస్, సీఐటీయూ నాయకులు భారతి, ఉమాదేవి, చంద్రకళ, అనురాధ, సునీత, వరలక్ష్మి , మహేందర్, అరుణ్, దీపక్, రాజు, వెంకటయ్య, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.