వికారాబాద్, ఏప్రిల్ 30 : రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సంబంధిత అధికారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆదేశించారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి వరి కొనుగోలు, సన్న బియ్యం పంపిణీ అంశాలపై జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులు మాట్లాడుతూ..జిల్లాలో 128 వరి కొనుగోలు కేంద్రాల్లో వరి కొనుగోలు ప్రక్రియను మొదలు పెట్టాలన్నారు.
కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు కావాల్సిన తాడిపత్రిలు, సంచులు, తేమ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారుల సూచించారు. కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వర్తించని వారిని తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రైస్ మిల్లర్ల వద్ద బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు వారికి అనుకున్న సమయంలో వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏవైనా సాంకేతిక లోపాలు ఉంటే కూడా సరి చేసుకోవాలని ఆయన తెలిపారు.