మహేశ్వరం : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పేదల పక్షపాతిగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabhita Indrareddy) అన్నారు. శుక్రవారం మహేశ్వరం గ్రామం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 40 మంది యువకులు, బీఆర్ఎస్ నాయకులు మీనాజ్ పటేల్, స్వర్ణగంటి సంజీవ, బహదూర్ గూడ మహేందర్ ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ (BRS) లో చేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే అభివృద్ధికి చిరునామాగా మారిందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి తెలంగాణలో కొనసాగుతుందని వివరించారు. నియోజక వర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో..
నియోజకవర్గంలోని మహేశ్వరం కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సందుల చంద్రశేఖర్, పేయల బాబురావు, దానప్ప గారి లక్ష్మయ్య, పేయల రవి, కిషన్, పవన్, ప్రశాంత్, శ్రీకాంత్, సంతోశ్ కుమార్, ప్రవీణ్, భాస్కర్ తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, అంబయ్య యాదవ్, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆధిల్ అలీ, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం తదితరులు పాల్గొన్నారు.