బషీరాబాద్ : విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని మండల విద్యాధికారి దుస్సా రాములు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయంలో పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందిం చాలన్నారు. అందించిన పాఠ్యపుస్తకాల వివరాలను ఐఎస్ఎంఎస్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా భోజనం, దుస్తులను, పాఠ్యపుస్తకలను అందిస్తుందన్నారు. ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేసి హాజరు శాతాన్ని పెంచాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, జగదీష్ కుమార్, శ్రీధర్ రెడ్డి, ఎంఆర్సీ కార్యాలయ సిబ్బంది కమల్ ప్రసాద్, రాహుల్, సి అర్ పి లో దత్తాత్రేయ, రాములు, తదితరులు పాల్గొన్నారు.